`బాహుబ‌లి-2` కు గుమ్మ‌డికాయ కోట్టేశారోచ్

0

prabhu-fifthshow

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అండ్ టీమ్ మ‌హాయ‌జ్ఞంలో భావించి తెర‌కెక్కిస్తోన్న` బాహుబ‌లి-2` షూటింగ్ ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. వాస్త‌వానికి డిసెంబ‌ర్ లోనే సినిమా పూర్తికావాలి. కానీ ప్యాచ్ వ‌ర్క్ ఉండ‌టంతో కొంచెం ఆల‌స్యమైంది. అయితే నేటితో సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో టీమ్ ఆ య‌జ్ఞానికి పుల్ స్టాప్ పెట్టేసింది. శుక్ర‌వారం టీమ్ గుమ్మ‌డికా కొట్టేసింది.

దీనికి సంబంధించి గుమ్మడికాయ పట్టుకున్న ప్రభాస్‌ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఇక షూటింగ్ పూర్త‌యింది కాబ‌ట్టి రిలీజ్ కు అడ్డంకులు లేన‌ట్లే. ముందు అనుకున్న‌ట్లే ఏఫ్రిల్ 28న రిలీజ్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com