“హిట్లర్” : చిరంజీవి : 20 సంవత్సరాలు !!!

0

mega star,chiranjeevi

దశాబ్ద కాలం తర్వాత ది మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తిరిగి సినీ రంగ ప్రవేశం “ఖైదీ నెంబర్ 150 “  తో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. దీనికి అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు ప్రముఖులు తిరిగి పున: స్వాగతం పలుకుతున్నారు.

కాగా చిరంజీవి నటించిన “హిట్లర్” సినిమా 04 -01 -2017  తో 20 సంవత్సరములు ఘనంగా పూర్తి చేసుకుంది. హిట్లర్ సినిమా అనగానే అన్నా చెల్లెళ్ళ అనుబంధం, బరువు బాధ్యతలు, అన్నాచెల్లల్ల మధ్య  మమకారాన్ని చిరంజీవి తన నటనతో అభిమానులందరని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కి ముత్యాల  సుబ్బయ్య దర్శకత్వం చేయగా ఎంవి లక్ష్మి గారు నిర్మించారు, ఎడిటర్ గ మోహన్ గారు, ఎల్ బి శ్రీరామ్ గారు స్క్రీన్ ప్లే ని అందించారు హీరోయిన్ గ రంభ మరియు ప్రత్యేక పాత్రలలో దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు,డా. రాజేంద్ర ప్రసాద్ గారు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజు గారు తదితరులు నటించారు. కోటి గారు తన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు.

“హిట్లర్” 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వేళా “ఫిఫ్త్ షో” తరుపున కంగ్రాట్స్ చెప్తూ చిరంజీవి గారి సినిమా పున ప్రవేశానికి స్వాగతం పలుకుదాం.

Share.

Leave A Reply