దిశా పాట్నీ ! కుంగ్ ఫు యోగా !! జాకీ చాన్ !!! హాలీవుడ్ ?”చైనీస్ – ఇండియన్ ??

0

disha-patani-1-fifthshow
దిశా పాట్నీ, ఈ ఉత్తరాఖండ్ ముద్దుగుమ్మచలన చిత్ర పరిశ్రమలోకి రాకముందు మోడలింగ్ చేస్తూ ఉండేది.
మోడల్స్ ని హీరోయిన్స్ గ మార్చడంలో స్పెషలిస్ట్ ఐన డైరెక్టర్ “పూరి జగన్నాథ్” తన “లోఫర్” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి మరియు చలన చిత్ర పరిశ్రమకు మొదటగా పరిచయం చేశాడు. మొదటి సినిమా తోనే తనదైన అందంతో అభినయంతో ప్రేక్షకుల మనసులను కొల్లగెట్టేసి బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడమే గాక ఏకంగా భారతీయ మరియు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ ” ఎం. ఎస్ .ధోని ” అంటోల్డ్ స్టోరీ లో నీటినుంచే అవకాశం కొట్టడమే గాక సినిమా సక్సెస్ లో తన దైన పాత్రతో అందరిని మెప్పించింది.

ఇపుడు ఏకంగా “హాలీవుడ్” పిక్చర్ “కుంగ్ ఫు యోగా” లో ప్రపంచ సుప్రసిద్ద నటుడు, మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్, చైనా ఆక్టర్ “జాకీ చాన్” పక్కన హీరోయిన్ గ ఛాన్స్ కొట్టేసి 2016 లో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. ఈ సినిమా ఇపుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉంధి కాగా ఇది ఇండియా లో ఫిబ్రవరి 3 న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

సినిమా విషయానికస్తే, ఇది ఒక “చైనీస్- ఇండియన్” సినిమా. “కుంగ్ ఫు యోగా” ఆక్షన్ మరియు కామెడీ తో కూడిన అడ్వెంచర్స్ ఫిలిం గ మనముందుకు వస్తుంది. దీనిలో దిశా సరసన మన బొమ్మాలి “సోను సూద్” కూడా ఇండియా నుండి నటిస్తున్నాడు. స్టాన్లీ టోంగ్ ఈ సినిమాకి దర్శకుడిగా, తైహేఎంటర్టైన్మెంట్ & షైన్ వర్క్ పిక్చర్స్ ఈ సినిమా ని 65 మిలియన్ అమెరికా డాలర్లతో నిర్మిస్తున్నారు. అంటే అక్షరాలా 433 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీనిని “మంగరిన్”, “ఇంగ్లీష్” మరియు “హిందీ” బాషలలో తీస్తున్నారు. జనవరి 26 న సింగపూర్, 28 న చైనా మరియు  ఫిబ్రవరి 3 న ఇండియా లో రీలీజ్ చేస్తున్నారు.

మొదటగా ‘టాలీవుడ్’, తర్వాత ‘బాలీవుడ్’ ఇపుడు ఏకంగా ‘ హాలీవుడ్ ‘. మనల్ని లోఫర్ గ అలరించిన ఈ ఉత్తరాకాండ్ ముద్దుగుమ్మ ‘దిశా’ అలాగే సోనూ సూద్ లు మున్ముందు ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలనీ ఇండియా చలన చిత్ర పరిశ్రమ కి ఇతర దేశాలలో కూడా తన సినిమాల ద్వారా మంచి పేరు తీసుకురావాలని మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ద్వారా మరియు 5th షో తరపున ఆశీర్వదిద్దాం ………”అల్ ది బెస్ట్ దిశా” & ” “అల్ ది బెస్ట్ (బొమ్మాలి) సోనూ సూద్”………………

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com