భూమి వైపు దూసుకొస్తున్న ఏడు గ్రహాలు

0

Earth could be destroyహైదరాబాద్‌ : ఇప్పటికే పలు మార్లు భూమి అంతం కానుందని ప్రచారారాలు జరిగినా.. భారీ భూకంపాలు తప్పించి భూమి అంతం కాలేదు. అయితే.. ఇప్పుడు 2017 అక్టోబర్‌ లో భూమి అంతరించనుందని కొత్త ప్రచారం ఊపందుకుంది. 2017 అక్టోబర్ లో భూమి అంతరించిపోతుందనే విషయాన్ని డేవిడ్ మీడే అనే రచయిత ‘ప్లానెట్ టెన్ – ది 2017 అరైవల్’ అనే పుస్తకంలో వెల్లడించారు. కుట్ర సిద్ధాంత కర్తలుగా పేర్కొనే కొందరు.. వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు అనే గ్రహం విచ్ఛిన్నం చేసిందని.. ఇది సౌరవ్యవస్థలో పదో గ్రహమని చెబుతున్నారు. ఇప్పుడు భూమికి దక్షిణ ధ్రువం వైపు నుంచి దూసుకొస్తోందని.. తన లాంటి మరో మరో ఏడు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకొని వస్తోందని చెబుతున్నారు. గురుత్వాకర్షణ ప్రభావం నుండి సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం 2017 అక్టోబర్ లో భూమిని తాకే అవకాశముందని.. ఇలాగే జరుగుతుందని చెప్పేందుకు సరిపడే సరైన ఆధారాలు లేవని డేవిడ్ మీడే వెల్లడించారు. ఈ నిబిరు గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం కష్టమని.. అదే సమయంలో దక్షిణ అమెరికాలోని ఎత్తయిన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి.. అధ్యయనం చేస్తే ఇది ఏ దిశగా వచ్చి భూమిని ఢీ కొడుతుందో గుర్తించేందుకు వీలు పడుతుందని చెప్పారు. అలానే.. మతబోధకులు బైబిల్ లో కూడా ఈ విషయం ఉందని చెప్పడం విశేషం. ప్రపంచం అంతరించి పోతుందని 2003, 2012, 2015లో ఎన్నో పుకార్లు వచ్చాయని.. ఇది కూడా లాంటిదే అని నాసా కొట్టిపడేసింది.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com