అన్న‌య్య మూవీ అంద‌రినీ అల‌రిస్తుంది: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌!!

0

pk-fifthshow

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఖైదీ నంబ‌ర్ 150తో `బాస్ ఈజ్ బ్యాక్` అంటూ అభిమానులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఆయ‌న రాక ఫ్యాన్స్‌లో ఫీవ‌ర్ రాజేస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు, టీజ‌ర్లు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. అటు రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన ఆల్బ‌మ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. మెగాస్టార్ మాస్ ..క్లాస్ స్టెప్ ల‌తో మెగా అభిమానుల్లో…ప్రేక్ష‌కుల్లో ఫీవ‌ర్ రాజేశారు. నేడు జ‌రిగే ప్రీ రీరిలీజ్ ఫంక్ష‌న్ తో వేడెక్కించే స్పీచ్ తో మ‌రింత అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. ఇలాంటి టైమ్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమ‌ను ఉద్దేశించి ఓ ట్విట్ చేస్తే ఎలా ఉంటుంది. ఎస్ ఇప్పుడు అదే జ‌రిగింది. అన్న‌య్య సినిమాను ఉద్దేశించి త‌మ్మ‌డు ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు.

“ చ‌ర‌ణ్, మా వ‌దిన సురేఖ నిర్మాణంలో వ‌స్తున్న తొలి సినిమా `ఖైదీ నంబ‌ర్ 150` కావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాన‌ని` సోష‌ల్ మీడియా ద్వారా ప‌వ‌న్ తెలిపారు. ఈ ఒక్క ట్విట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుంది. ప‌వ‌న్ చేసిన ఈ ట్విట్ మెగా అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని నింపింది. బాస్ క‌మ్ బ్యాక్ మూవీ బ్లాక్ బస్ట‌ర్ అంటూ రీ ట్విట్ లు మొద‌ల‌య్యాయి.

Share.

Leave A Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com